Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Yalamanchili Ravi is joining YSRCP!

By   /  April 13, 2018  /  Comments Off on Yalamanchili Ravi is joining YSRCP!

    Print       Email

వైసీపీలోకి య‌ల‌మంచిలి

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* రేపు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం

* టీడీపీలో గౌర‌వం ద‌క్క‌లేదు

* టికెట్ ఇస్తామ‌ని చెప్పి మోసం చేశారు

* మీడియాతో య‌ల‌మంచిలి ర‌వి

డెక్క‌న్ అబ్రాడ్‌:  తెలుగుదేశం పార్టీకి గ‌త కొద్ది రోజులుగా కాలం క‌లిసి రావ‌డం లేదు. తెలుగుదేశం పార్టీని బీజేపీ ప‌ట్టించుకోక పోవ‌డం, బీజేపీ నుంచి దూరం కావ‌డం, కేంద్ర కేబినెట్ ప‌ద‌వుల‌ను వ‌దులుకోవ‌డం ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అంతేకాదు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎటూ తేల్చుకోలేక వెనుకా ముందు ఆలోచ‌న‌లు చేయ‌డంతో టీడీపీకి జ‌రిగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. దాన్ని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాల‌ని ఆలోచిస్తున్న త‌రుణంలో కొంత‌మంది టీడీపీ నాయ‌కులు బాబుకు షాక్ ఇస్తున్నారు. పార్టీ మార‌తామ‌ని కొంత‌మంది బెదిరిస్తుంటే మ‌రికొంత‌మంది పార్టీ మారుతున్నారు. తాజాగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచ‌లి ర‌వి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శనివారం పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు చెప్పారు.

ఉదయం 9గంటలకు కనకదుర్గమ్మ వారథి వద్ద జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. టీడీపీలో తనకు సరైన గౌరవం దక్కలేదన్నారు. కొందరు తనను టీడీపీలో చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఒక దశలో తాను టీడీపీలో ఉన్నానా లేదా అని బాధేసిందన్నారు. టీడీపీ మంత్రులు తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. అప్పుడు బాధపడ్డానన్నారు. అందుకే గౌరవం లేని టీడీపీలో ఉండకూడదని వైసీపీలో చేరుతున్నట్టు చెప్పారు. తనను ఉపయోగించుకుని , టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAGC 2019 Women’s Day Celebrations

Read More →