Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Yanamala fires on YSRCP MLA’s for their protest in AP Assembly..

By   /  March 23, 2017  /  Comments Off on Yanamala fires on YSRCP MLA’s for their protest in AP Assembly..

    Print       Email

yanamala ramakrishnudu at assemblyవైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి యనమల..

 

InCorpTaxAct
Suvidha

 

 

విపక్ష సభ్యుల తీరు ఏ మాత్రం సబబుగా లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సభలో మాటిమాటికి సభ్యులు అడ్డుపడుతున్నారని అన్నారు. సభను సజావుగా సాగనివ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చేసే కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సభ్యులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

స్పీకర్ ఛాంబర్ చుట్టు ఓ రెడ్ లైన్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ లైన్ ను దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే స్పీకర్ పోడియం వైపు రెడ్ లైన్ దాటి వెళ్లే సభ్యులను సస్పెండ్ చేయాలని సూచించారు. అలాగే పార్లమెంట్ తరహాలో ఆటోమేటిక్ సస్పెన్షన్ చట్టాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని సూచించారు. మాటిమాటికి సభకు అడ్డుతగులుతూ ఉంటే సభా కార్యక్రమాలు ఎలా సజావుగా సాగుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారికిచ్చిన సమయంలో మాట్లాడకుండా టైమ్ ని వేస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో అయ్యే ఖర్చు అంతా వేస్ట్ అవుతున్నట్లే కదా అంటూ ప్రశ్నించారు. వేస్ట్ అయిన ఖర్చును సదరు సభ్యుల నుంచి రికవరీ చేయాలని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →