Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Yanamala Ramakrishnudu gets Rajyasabha MP?

By   /  April 20, 2016  /  Comments Off on Yanamala Ramakrishnudu gets Rajyasabha MP?

    Print       Email

yanamalaయ‌న‌మ‌ల‌కు రాజ్య‌స‌భ‌?

 

InCorpTaxAct
Suvidha

 

 

4 స్థానాల్లో పోటీకి టీడీపీ య‌త్నం

సుజ‌నాకు మ‌రో అవ‌కాశం ఇవ్వొద్ద‌ని బాబుకు బీజేపీ సూచ‌న‌

నిర్మ‌ల సీతారామ‌న్‌కు మ‌రోసారి అవ‌కాశం

 

తెలుగుదేశం ప్రభుత్వం క్యాబినెట్‌లో చంద్ర‌బాబు నాయుడుకు కుడిభుజంగా.. ఆర్థిక శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని ఈసారి రాజ్య‌స‌భ‌కు పంపించే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి కూడా ఎప్ప‌టి నుంచే రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని ఉంద‌ని బాబు వ‌ద్ద చెప్పిన నేప‌థ్యంలో బాబు కూడా ఆయ‌న మాట‌కు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే ఇదే క్ర‌మంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ కోటాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఖాయమని పార్టీ  వ‌ర్గాల స‌మాచారం. కాగా య‌న‌మ‌ల రాజ్య‌స‌భ‌కు వెళ్లితే జగన్ వంటి బల మైన నాయకుడిని ఎదుర్కోవాలంటే సీనియారిటీ ముఖ్య మని, ప్రస్తుతం అంత అనుభవం ఉన్న నాయకుల సంఖ్య తక్కువేనని టీడీపీ స‌భ్యులే అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో యనమల అనుభవమే ప్రభుత్వానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని కూడా అనుకుంటున్నారు.

వైసీపీ గెలుపు ప్ర‌శ్నార్థ‌క‌మే?

రాజ్యసభ ఎన్నికలకు ఈనెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీలో మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాంకేతికంగా చూస్తే తెలుగుదేశానికి 3,వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి 1 స్థానం ల‌భించ‌నుంది. అయితే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుండ‌డంతో  వైసీపీ రాజ్యసభ అభ్యర్ధిగా భావిస్తున్న విజయసాయిరెడ్డి గెలుపు ప్రశ్నార్ధకం కానుంది. ఆయనపై పోటీ పెట్టేందుకు టీడీపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇక‌పోతే సుజ‌నా చౌద‌రికి మ‌రోసారి అవ‌కాశం ఇవ్వొద్ద‌ని  ప్రధాని కార్యాలయం సైతం  చంద్ర‌బాబుకు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.  ఆయన బదులు మీ విధేయులు ఒకరిని సిఫారసు చేయమని కూ డా సూచించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారంగా చూస్తే సుజనా చౌదరికి సీటు లేనట్లుగానే స్పష్ట మవుతోంది.  కాగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలాసీ తారామన్‌కు సీటు ఇవ్వడం దాదాపు ఖరారయిందని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →