Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YCP MLAs Suspended From Assembly

By   /  March 9, 2016  /  Comments Off on YCP MLAs Suspended From Assembly

    Print       Email

ap assembly

ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల సస్పెన్షన్..

InCorpTaxAct
Suvidha

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో భూముల కోనుగోలు వ్యవహారంపై అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ఈ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. భూముల వ్యవహారంలో సీఎం చంద్రబాబు ముద్దాయి అని ప్రతిపక్ష నేత జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు సూచనలతోనే మంత్రులు, టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారని ఆరోపణలు గుప్పించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండకరాలు ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు రూ.2లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి తనపై.. తన మంత్రులపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. అలా నిరూపించలేని పక్షంలో జగన్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.టీడీపీ నేత ధూళిపాళ్ల మాట్లాడుతూ .. అమరావతి ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు భూములు కొన్నారని అన్నారు. రాజధానిపై కక్షతోనే జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అవినీతి కేసులో 11నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్‌ అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. సీఎం చంద్రబాబు చేసిన సవాల్‌ను స్వీకరించి ఆరోపణలను నిరూపించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు వైసీపీ అధినేత జగన్‌కు సూచించారు.

రాజధాని నిర్మాణం జరగకూడదని జగన్ భావిస్తున్నారని మరో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు. తాను సీఎం అయ్యే వరకు ఎవరిని వైఎస్ఆర్ ప్రశాంతంగా ఉండనీయలేదని .. జగన్ పద్ధతి కూడా అలానే ఉందని మండిపడ్డారు. రాజధాని కోసం స్వచ్ఛదంగా భూములు ఇచ్చిన రైతులను జగన్ అవమానిస్తున్నారని అన్నారు.సీఎం పట్ల అగౌరవంగా మాట్లాడటం ప్రతిపక్షానికి సరికాదని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. దేశంలోని సీనియర్‌ రాజకీయ నాయకుడిగా చంద్రబాబుకు మంచి పేరుందన్నారు. సీఎం, మంత్రులపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోతే సభాసాక్షిగా ప్రతిపక్ష నేత జగన్‌ క్షమాపణ చెప్పాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఆధారాలు ఉంటే స్పీకర్‌కు సమర్పించాలన్నారు. లేదంటే తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని సూచించారు. ఈ విషయం తేలేవరకు సభా కార్యక్రమాలు కొనసాగించేది లేదన్నారు. ఇక అధికార పార్టీ సభ్యుల స్పందనపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది.దీంతో వైసీపీ సభ్యులు అసెంబ్లీలో నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ మంత్రి యనమల ఆరోపించారు. సభ్యుల పేర్లను ప్రకటించి వారిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్‌ను కోరారు. దీంతో ఆ సభ్యులను ఇవాళ్టికి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

సస్పెండైన వైసీపీ సభ్యులు..

అంజాద్‌ బాషా, అనిల్‌కుమార్‌, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చాంద్‌బాషా,డి.ఈశ్వరి, గోవర్థన్‌రెడ్డి, ఐషయ్య, జగ్గిరెడ్డి, జయరాం, జోగులు,కళావతి, కల్పన, ఎస్వీ మోహన్‌రెడ్డి షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, నారాయణస్వామి, జ్యోతుల నెహ్రూ, పుష్ప, శ్రీవాణి, రఘుపతి, రఘురామిరెడ్డి, రాజన్నదొర, రాజేశ్వరి, రామచంద్రారెడ్డి,, రామకృస్ణారెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, సాయిప్రసాద్‌రెడ్డి, సర్వేశ్వరర్రావు, శివప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులు, శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సురేష్‌, తిప్పారెడ్డి, జయరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →