యూపీ 21వ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం..
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.లక్ నవూలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, యూపీ మాజీ సీఎంలు అఖిలేశ్‌యాదవ్, ములాయంసింగ్ యాదవ్ హాజరయ్యారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇటీవల ఎన్నికల్లో బీజేపీ అద్వితీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్కడ 403 స్థానాలకు గాను ఏకంగా 312 స్థానాలు సాధించుకుంది. ఇక బీజేపీ మిత్ర పక్షాలు అప్నాదళ్(ఎస్) 9, ఎస్బీఎస్పీ 4 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో బీజేపీ సంకీర్ణం మొత్తం 325 సీట్లు సాధించింది. దీంతో 15ఏళ్ల తర్వాత యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.ఇక ఆదిత్యనాథ్ యూపీకి 21వ సీఎం. యూపీలో బీజేపీ తరపున సీఎం పదవిని చేపట్టిన వారిలో ఆయన నాలుగో వ్యక్తిగా నిలిచారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.