Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

You have to give an AP status, Chandrababu Naidu demands!!

By   /  March 13, 2018  /  Comments Off on You have to give an AP status, Chandrababu Naidu demands!!

    Print       Email

ఏపీకి హోదా ఇవ్వాల్సిందే

Suvidha
Biryani Pot

 

 

 

 

* ఏ సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారు?

* 14వ ఆర్థిక సంఘానికి, హోదాకు సంబంధం ఏంటి?

*  హోదా 10 ఏళ్లు ఇస్తామ‌ని చెప్పి ఇప్పుడు ఎదురు దాడి చేస్తారా?

* ఎన్టీఆర్ ఆత్మ‌గౌర‌వం ఇస్తే.. నేను ఆత్మ విశ్వాసం ఇచ్చాను

* గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు

డెక్క‌న్ అబ్రాడ్‌: రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలు, చ‌ట్టంలో పొందుపరిచిన హామ‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాస‌న మండ‌లిలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై  చంద్ర‌బాబు మాట్లాడారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే, తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని తెలిపారు. మన కష్టాన్ని ఎవరూ తీసేయలేరన్నారు. ఇది ప్రజల ఆత్మగౌరవ సమస్య అని, తమ హక్కులను సాధించుకుంటామని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ఇటీవల ఆ సంఘం సభ్యుడు చెప్పడాన్ని గుర్తు చేశారు. సెంటిమెంట్‌తో డబ్బులు రావని కేంద్ర మంత్రి అంటున్నారని, కానీ ఏ సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని విడదీశారని ప్రశ్నించారు. సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, చేసిన వాటిని చెప్పండి, సమీక్ష చేయండని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినట్లే, ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను గౌరవించాలన్నారు. మీ డబ్బూ- మా డబ్బూ అంటూ ఉండదని, ఆ డబ్బంతా ప్రజలేదనని వ్యాఖ్యానించారు.

దక్షిణాది నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, కానీ వాటిని ఉత్తరాదిలో ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్లకు నిధులు ఇచ్చామని చెబుతున్నారని, కానీ అది పీపీపీ రోడ్లని, కేంద్ర నిధులు కాదన్నారు. హోదా ఇచ్చి ఉంటే మరిన్ని పరిశ్రమలు ఏపీకి వచ్చి ఉండేవన్నారు. హోదా రాష్ట్ర హక్కు అని, పారిశ్రామిక రాయితీలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్, యుపీలతో ఏపీని ఏలా పోలుస్తారన్నారు. హామీలు నెరవేర్చకుండా, హోదా 10 ఏళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ తమపై ఎదురుదాడి చేస్తే, ఏం చేయను? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన తమకు సీసీఎంబీ వంటి పరిశోధనా సంస్థలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. విభజన బలవంతంగా చేశాక, ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కీలకమైన రైల్వే జోన్, సెంట్రల్ వర్సిటీ, కడప ఉక్కు కర్మాగారం వంటివి కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చే వ‌ర‌కు తాము పోరాటం చేస్తామ‌ని బాబు అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →