Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

కురిపించే మేఘమంటె నీ నవ్వే..!

By   /  July 5, 2016  /  No Comments

    Print       Email

86ee37b89c9534f82ed9f7c4095f4f0fనీడలన్ని కాల్చేసే దీపమంటె నీ నవ్వే..!

అనుక్షణం నడిపించే మౌనమంటె నీ నవ్వే..!
కడలిగుండె మీటుతున్న శ్వాస లయకు చెలియ నీవు..!
చెలిమివాన కురిపించే మేఘమంటె నీ నవ్వే..!
చిత్రగతుల చిత్తరువుల నాట్యాలకు వేదికవే..!
సొగసులతో మురిపించే గగనమంటె నీ నవ్వే..!
చురుకుదనపు చిరునామా దాచుకున్న వేకువవే..!
కిరణాలను అలరించే రాగమంటె నీ నవ్వే..!
కోటికోట్ల విద్యలన్ని అక్షరాల నీ సొంతం..!
తలచినంత అందించే  ప్రాణమంటె నీ నవ్వే..!
ఈ మాధవ గజలులోని ధారమాటు రాధవు కద..!
ప్రతి’భా’వన.. పండించే స’రసమంటె నీ నవ్వే..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →