Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Yousuf Malala fires on pakistan people

By   /  April 17, 2017  /  Comments Off on Yousuf Malala fires on pakistan people

    Print       Email

yousuf malalaపాకిస్థాన్- ఇస్లాం కీర్తి ప్రతిష్టలను పాకిస్థానీయులే పాడు చేస్తున్నారు: మలాలా

 

InCorpTaxAct
Suvidha

 

 
పాకిస్థాన్- ఇస్లాంకు ఉన్న కీర్తి ప్రతిష్టలను పాకిస్థానీయులే పాడు చేస్తున్నారని నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆరోపించారు. దైవ దూషణ చేస్తున్నట్లు ఓ విద్యార్ధిని ఆరోపించి సామూహికంగా హతమార్చడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైబర్ పష్తూన్‌లోని అబ్దుల్ వాలీ ఖాన్ యూనివర్సిటీలో మషాల్ ఖాన్‌ అనే విద్యార్ధి జర్నలిజం చదువుతున్నాడు. అతన్ని అదే వర్సిటీకి చెందిన ఇతర విద్యార్ధులు అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. అతను దైవ దూషణ చేస్తూ అహ్మదీయ విశ్వాసాలను ఆన్ లైన్ లో ప్రచారం చేస్తున్నాడని పలువురు ఆరోపించారు.

ఈ అంశంపై పాక్ కు చెందిన ఉద్యమకారిణి యలాలా ఓ వీడియోను పోస్ట్ చేశారు. మషాల్ ఖాన్ మరణ వార్త తనకు తెలిపిందని అన్నారు.ఈ ఘటన హింసాత్మకమైనదని అన్నారు. ఇదిలాఉంటే మృతుడి తండ్రి అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారని అన్నారు. ఆయన మెసేజ్ ని తాను ప్రశంసిస్తున్నానని అన్నారు.పాక్ లో ఇస్లామా ఫోబియా ఉందని అన్నారు. పాక్ పేరును ఇతర దేశాలు చెడగొడుతున్నాయని అంటూ ఉంటామని చెప్పారు. అయితే పాక్ కు , ఇస్లాంకు ఉన్న పేరును చెడగొడుతున్నది కేవలం పాక్ దేశీయులేనని మండిపడ్డారు.ఇప్పడు జరుగుతున్నవి మషాల్ అంత్యక్రియలు కాదని మత బోధనలకు అంత్యక్రియలు అని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →