కేసీఆర్‌పై పేలిన జ`గన్`
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు కేసీఆర్‌ను ఒక్క మాట కూడా మాట్లాడని జగన్ ఇప్పుడు ఆయనపై దుమ్మెత్తి పోశారు. తన సహజ ధోరణికి భిన్నంగా మాట్లాడిన జగన్ అక్రమ ప్రాజెక్టులను ఎలా కడతారంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కర్నూలు వేదిక మూడు రోజులపాటు చేయనున్న జలదీక్షలో మొదటి రోజు కేసీఆర్‌ను చంద్రబాబును కడిగి పడేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలపై ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే కింద ఉన్న రాష్ట్రాలకు నీళ్లు ఎలా వస్తాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కట్టే ప్రాజెక్టులు అవి అక్రమమని, అసలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు. ఎత్తిపోతలపై ప్రాజెక్టులు కడితే ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కూడా కేసీఆర్ అన్యాయం చేసిన వారు అవుతారని విమర్శించారు. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 84ప్రకారం నిబంధనలున్నాయని, ముందుగా సీడబ్ల్యుసీ అనుమతి.. నీటి యాజమాన్య బోర్డుల అనుమతి తీసుకోవాలని తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టంగా అందులో ఉందని చెప్పారు.
గోదావరి నది నుంచి కూడా నీళ్లను కేసీఆర్ తీసుకుపోతున్నారు. ఎవడబ్బ సొమ్మని నీళ్లు తీసుకుపోతున్నారని ఘాటుగా స్పందించారు. 954 టీఎంసీలు తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? మిగిలినవి మాత్రమే పంపుతామని కేసీఆర్ హిట్లర్‌లా మాట్లాడడం భావ్యం కాదన్నారు. తెలంగాణలో మీ వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతనేది రెండు నదుల విషయంలో తేలలేదు.కేవలం మీ అవసరాలు తీరిన తర్వాతే మాకు నీళ్లు పంపుతామంటూ మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. బ్రహ్మం గారు చెప్పినట్లు నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయోమోనని భయమేస్తోందన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం మన రాష్ట్రంలోని వాళ్లకే కాదు దేశంలోని నాయకులందరికీ తెలియాలి. కేసీఆర్ కు చంద్రబాబుకు కూడా జ్ఞానోదయం కావాలి. అందరం కలిసికట్టుగా పోరాడి మన వాటాను మనం సాధించుకుందామని జగన్ పిలుపునిచ్చారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.