Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan condemns assault on Dholitalu

By   /  August 13, 2016  /  Comments Off on YS Jagan condemns assault on Dholitalu

    Print       Email

ysjagan (2)ద‌ళితుల‌పై దాడి అమానుషం

 

InCorpTaxAct
Suvidha

 

 

“ద‌ళితుల‌ను చెట్టుకు క‌ట్టేసి కొడ‌తారా? కొంచెం కూడా మాన‌వ‌త్వం లేదా? వాళ్లు చేసిన త‌ప్పు ఏంటి? ద‌ళితుల‌పై దాడి చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి లేదా?“ అని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుచుకుంటున్న దళితులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను వైయ‌స్ జ‌గ‌న్ అమలాపురం ఏరి యా ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. నిన్న ఇదే జిల్లాకు వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు క‌నీసం దాడి జ‌రిగిన ద‌ళితుల‌ను ప‌రామ‌ర్శించి ఉంటే వాళ్ల‌లో కొంత మ‌నోధైర్యం అయినా వ‌చ్చి ఉండేద‌న్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబితే బాధితుల్లో నమ్మకం క‌లిగి ఉండేద‌న్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టం ప్రకారం.. ఇలాంట దారుణమైన ఘటనలు జరిగితే ప్రభుత్వం తరుపున బాధితులకు రూ.లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్య‌మంత్రి మాత్రం అందులో మొద‌టి చెప్పిన రూ.ల‌క్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చ‌ట్టంలో ఉన్న‌ట్లుగా  నలుగురు బాధితులకు రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన విషయాలు వింటే గుండె బరువెక్కుతోంద‌ని జ‌గ‌న్ అన్నారు. వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా? అని ప్ర‌శ్నించారు.  వారు దశాబ్దాలుగా చర్మాలు వలుచుకునే వృత్తిలో ఉన్నార‌ని, బతుకు తెరువు కోసం వారికి మరో మార్గం లేద‌న్నారు. ఆవు చర్మం తీస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరిని శ్మశానం నుంచి దాదాపుగా 300 మీటర్లు చొక్కా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా లాక్కొని పోయార‌ని, శ్మశానం నుంచి బయటకు వచ్చిన తరువాత చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టార‌ని మండిప‌డ్డారు. దుర్భాషలాడుతూ చెప్పు తీసుకుని మరీ కొట్టారు. చిన్న పిల్లవాడిని కూడా వదిలిపెట్టకుండా కొట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →