Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan did he get the invite for Krishna Pushkaralu?

By   /  August 13, 2016  /  Comments Off on YS Jagan did he get the invite for Krishna Pushkaralu?

    Print       Email

ysjagan (2)పుష్క‌రాల‌కు జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తున్నారా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ మొండిగా ముందుకెళ్తోందా? కావాల‌నే అలా చేస్తోందా? ప‌్ర‌తిప‌క్ష నేత‌ను అవ‌మానించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుందా? అంటే అవున‌నే అంటున్నారు వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేత‌లు. వివ‌రాల్లోకి వెళ్లితే.. మామూలుగా అయితే పుష్కరాలకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎవ‌రినీ పిల‌వాల్సిన అవ‌స‌రం లేదు. నమ్మకం ఉన్న వాళ్లు పుష్కర  స్నానం చేస్తారు. అయితే పుష్క‌రాల‌కు ఎంత‌మంది వ‌స్తారు అనే అంచ‌నా ప్ర‌భుత్వం వేసుకుని వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకోవాలి.  కానీ గోదావరి పుష్కరాల నుంచి కృష్ణా పుష్కరాల వరకూ చంద్రబాబు సర్కారు మాత్రం వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి హంగామా చేస్తోంది. పోనీ పుష్కరాలు అద్భుతంగా నిర్వహిస్తే అవార్డులేమీ రావు. ఓ వైపు రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సమయంలో  ప్రజలెవరూ హంగామా చేయాలని ప్రభుత్వాన్ని కోరలేదు. అసలు ఇందులో వింత ఏమిటంటే ఏపీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు మ‌ద్రాసు వెళ్లి మరీ డీఎంకె నేత కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్ లను కలసి  మరీ ఆహ్వానించారు. ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘనాధరెడ్డి హైదరాబాద్ లో ఉన్న సినిమా ప్రముఖుల అందరికీ ఇళ్ళకు వెళ్లి మరీ ఆహ్వానించారు. అంతా అయిపోయాక తాపీగా..పుష్కరాలు ప్రారంభం అయిన తర్వాత శుక్రవారం రాత్రి ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానించనున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు ప్రకటించారు.

కాగా అందరినీ ముందే పిలిచి..ప్రతిపక్ష నేతను మాత్రం పుష్కరాలు ప్రారంభం అయ్యక ఆహ్వానించనున్నట్లు ప్రకటించటం విమర్శలకు దారితీస్తోంది. పోనీ జగన్ అందుబాటులో లేకపోతే కార్యాలయానికి..ఇంటికో ఆహ్వానం పంపితే సరిపోతుంది. అంతే కానీ ఇలా చేయటం ప్రభుత్వానికి మాత్రం ఏ భావ్యంకాదని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. దీనిపై వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పార్థ‌సార‌ధి స్పందిస్తూ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను అవ‌మానించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటూ ప్ర‌భుత్వం ముందుకెళ్తోంద‌న్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు డ్రామాలు ఆపాల‌ని, లేక‌పోతే స‌ర్కార్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →