Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan fires on Chandra Babu!

By   /  June 3, 2016  /  Comments Off on YS Jagan fires on Chandra Babu!

    Print       Email

jaganఎంత‌మాట అన్నావ్ జ‌గ‌న్‌?

 

InCorpTaxAct
Suvidha

 

 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనంత‌పురం జిల్లాలో రైతు భ‌రోసా యాత్ర చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ఏమీ చేయ‌డం లేద‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. ఆ విమ‌ర్శ‌లు ఎంత‌వ‌ర‌కు వెళ్లాయంటే ఏపీ సీఎం చంద్ర‌బాబును చెప్పుతో కొట్టినా పాపం లేద‌న్న స్థాయికి వెళ్లాయి. నిన్న విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్‌లో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ  ఉమ్మ‌డి రాష్ట్రాన్ని అన్యాయంగా విడ‌గొట్టార‌ని, ఇప్పుడు ఏపీకి క‌నీసం ప్ర‌త్యేక హోదా కూడా ఇవ్వ‌డం లేద‌న్న దానిపై ప్ర‌తిప‌క్ష నేత స్పందిస్తూ బాబు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నాడ‌ని, బాబు చెప్పిన‌ట్లు ప్ర‌త్యేక హోదా రావాల‌టే బాబు ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ ఆయ‌న‌ను చెప్పుతో కొట్టాల‌న్నారు. అప్పుడు త‌ప్ప ఆయ‌న బుద్ధి రాద‌న్నారు.  గుడిని గుడిలోని లింగాన్నీ మింగే చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భూములను తక్కువ ధరకు పెట్టుబడిదారులకు కట్టబెట్టారని, అలా సంపాదించిన అవినీతి డ‌బ్బుతో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌ని ఆరోపించారు.

పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి,తిరిగి గెలిపించుకొనే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణాలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా అడిగే దమ్ము చంద్రబాబుకు లేదని జగన్‌ విమర్శించారు. ఒకవేళ అడిగితే ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌ జైలుకు పంపుతారని భయమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటానని అల్టిమేటం ఇచ్చే పరిస్థితీ లేదన్నారు. అలా చేస్తే ఈ రెండేళ్లలో బాబు అవినీతిపై మోదీ సీబీఐ విచారణ చేయిస్తారని భయమని విమర్శించారు. కాగా ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై అధికార పార్టీ ఎలా స్పందిస్తూ చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →