Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan First Time Telugu Channel Interview

By   /  December 6, 2017  /  Comments Off on YS Jagan First Time Telugu Channel Interview

    Print       Email
జగన్ మరో సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో గత నెల 6 నుంచి వైసీపీ నేత వైఎస్ జగన్  ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కర్నూల్ జిల్లాలో పలు గ్రామాల్లో సందర్శించిన ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు నీరాజనాలు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై గళం విప్పుతున్న జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రలో మూడువందల కిలోమీటర్ల మైలు రాయి దాటిన జగన్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రెస్ మీట్ పెట్టినపుడు తప్ప ఎప్పుడూ మీడియాతో మాట్లాడని వైసీపీ అధినేత ఇప్పుడు ఏకంగా ఛానెల్ ఇంటర్వ్యూలకే వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు జగన్ ఎక్కువగా జాతీయ మీడియాతోనే మాట్లాడేవారు. ఇప్పటి వరకు తెలుగు చానల్ లో ఒక్కసారి కూడా ఇంటర్వ్యూకి చాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడూ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వని జగన్ ఒక్క సారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నాయకులలో నూతన ఉత్సహం వచ్చినట్లు అయింది. ఓ పక్క పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని అధికార పార్టీలోకి జంప్ చేస్తుంటే వారిని అదుపు చేయడానికి.. చంద్రబాబుపై విమర్శలను ఎక్కు పెట్టడానికి.. మరోవైపు పవన్ వ్యాఖ్యలకు చెక్ చెప్పేందుకే వ్యూహాత్మకంగా జగన్ తన ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వనున్నారాని పార్టీ నేతలు రక రకాలుగా భావిస్తున్నారు.
Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st at George R Brown Convention Center Houston, TX .

Read More →