Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan & Galla jayadev jointly fighting for AP special status

By   /  August 10, 2016  /  Comments Off on YS Jagan & Galla jayadev jointly fighting for AP special status

    Print       Email

galla jayadevజ‌గ‌న్‌కు జైకొట్టి గ‌ల్లా!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత ఢిల్లీబాట ప‌ట్టారు. హోదా ఆవ‌శ్య‌క‌త‌ను ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ మిత్ర‌ప‌క్షమైన తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. అధికార‌ప‌క్షంలో ఉండి కేంద్రం ఒత్తిడి చేయాల్సింది పోయి హోదా గురించి ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని విప‌క్ష స‌భ్యుల‌తో పాటు, సొంత పార్టీ స‌భ్యులు కూడా చంద్ర‌బాబు తీరును వ్య‌తిరేకిస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌బోమ‌ని కేంద్రం అంటున్నా బాబు ఆదేశాల మేర‌కు  ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని టీడీపీ ఎంపీలు మ‌థ‌న‌మ‌డిపోతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే హోదా కోసం పోరాడుతున్ను జ‌గ‌న్‌కు కొంత‌మంది లోలోప‌ల మ‌ద్ద‌తు తెలుపుతుంటే మ‌రికొంత‌మంది బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అలా మ‌ద్ద‌తు తెలుపుతున్న వారిలో గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్  కేంద్రం వైఖరిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. తమ సహనం నశిస్తోందని అనేశారు. అంతేకాదు.. కేంద్రం ఏదో ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు యత్నిస్తున్నట్టుగా ఉందని కానీ తమకు మాత్రం హోదాయే ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటిస్తుందని వేచి చూస్తున్నామని కానీ ఇటీవల సంకేతాలు మారిపోయినట్టు తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో మరింత గా తాము విజృంభిస్తామన్నారు. అదేసమయంలో తమ ప్రత్యర్థి జగన్ పార్టీ హోదా కోసం చేసే ప్రయత్నాలను స్వాగ‌తిస్తున్నామ‌ని చెప్పారు. కాగా ఇప్పటి వరకు విపక్ష ఎంపీలు చేసిన ఆందోళనకు దూరంగా ఉన్న టీడీపీ ఎంపీలు ఇకపై జగన్ పార్టీ ఎంపీలతోనూ కలిసి ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జ‌గ‌న్‌కు జై కొడుతున్న టీడీపీ ఎంపీల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →