Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan in Rshikesh why?

By   /  August 11, 2016  /  Comments Off on YS Jagan in Rshikesh why?

    Print       Email

YSR PRECIDENT YS JAGNA MONHAN REDDY ALONG WITH HIS PARTS MPS PARTICIPATED IN THE HOMAM AT RISHIKESH FORFORMED BY SWARUPANANDENDRA SWAMY?జ‌గ‌న్ రుషికేశ్ ఎందుకు వెళ్లారు?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉన్న‌ట్లుండి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రుషికేశ్ ఎందుకు వెళ్లారు? అక్క‌డ నిర్వ‌హించిన హోమంలో ఎందుకు పాల్గొన్నారు? ప‌విత్ర గంగాన‌దికి పూజ‌లు చేసి ఏం కోరుకున్నాడు? అంటే మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని జ‌గ‌న్ కోరుకున్నాడ‌ని ఆ పార్టీనేత‌లు అంటున్నారు. కాగా ఇప్పుడే ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది అనే దానికి కూడా వాళ్లు స‌మాధానం చెబుతున్నారు. నాలుగు నెల‌ల‌పాటు సాగే చ‌తుర్మాస దీక్షలో ఎవ‌రైనా పాల్గొని పూజ‌లు.. హోమాలు చేస్తే వాళ్లు అనుకున్న ప‌ని నెర‌వేరుతుంద‌ని ప్ర‌జ‌ల విశ్వాస‌మ‌ని,  అందుకే ఏదైనా పెద్ద కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌న్నా.. అనుకున్న‌దిసాధించాల‌న్నా చాతుర్మాస దీక్ష‌ల్లో చేసే హోమాల్లో పాల్గొంటుటార‌ని వారంటున్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా అదే న‌మ్మ‌కంతో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్‌లో నిర్వహించిన హోమంలో పాల్గొన్నార‌ని వారు చెబుతున్నారు.

కాగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కాంక్షిస్తూ జగన్ హోమం లో పాల్గొనడానికి ఇంత దూరం రావడం సంతోషకర‌మ‌న్నారు. దేవుడి మీద విశ్వాసంతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకోవడం గొప్ప విషయమ‌న్నారు.  హోమం పవిత్రంగా జరిగిందని,  ఇక పరమేశ్వరుడే అనుగ్రహించాలన్నారు. జగన్ ధృడంగా ఆకాంక్షిస్తున్న ప్రత్యేక హోదా కల త్వరలోనే నెరవేరుతుందని,  దేవుడు, ప్రజల ఆశీస్సులతో జగన్ మరింత గొప్ప వ్యక్తిగా ఎదగాలని ఆయ‌న ఆకాంక్షించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →