Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan is director?

By   /  June 7, 2016  /  Comments Off on YS Jagan is director?

    Print       Email

jaganజ‌గ‌న్ డైరెక్ట‌ర్ ఎప్పుడ‌య్యారు?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనంత‌పురం జిల్లాలో ఐదు రోజుల పాటు రైతు భ‌రోసాయాత్ర నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఐదు రోజుల్లో చాలా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రెండు రోజులు మామూలుగానే సాగినా మూడోవ రోజు నుంచి ఏకంగా సీఎం చంద్ర‌బాబుపైనే మాట‌ల దాడి చేశారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌ని చంద్ర‌బాబును ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ ఆయ‌న‌కు చెప్పులు చూపించండి చెప్ప‌డంతో రాష్ట్రంలో ఉన్న‌ట్లుండి రాజ‌కీయ వేడి మొద‌లైంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాలు విసురుకున్నారు. అంతేకాదు చెప్పుల‌తో మిమ్మ‌ల్ని కొట్టాలి అంటే మిమ్మ‌లి కొట్టాలి అనేంత‌వ‌ర‌కు వెళ్లింది. అయితే చివ‌రి రోజు భ‌రోసా యాత్ర‌లో జ‌గ‌న్ ఒక క‌థ వినిపించి ముగింపు ఇచ్చారు. ఎప్పుడూ రాజ‌కీయాల‌నే అనుకున్నారో ఏమో కానీ డైరెక్ట‌ర్ అవ‌తార‌మెత్తి సినిమా క‌థ‌ను వినిపించారు.

జ‌గ‌న్ వినిపించిన క‌థ ఆయ‌న మాట‌ల్లోనే “14 రీళ్లుఉండే సినిమాలో మొద‌టి నుంచి విల‌న్ ఆధిప‌త్యం కొన‌సాగుతుంది. హీరోకి ఏమీ తెలియ‌దు పాపం.. అత‌నికి అవినీతి తెలియ‌దు.. దోచుకోవ‌డం తెలియ‌దు. అప‌బ‌ద్ధాలు ఆడ‌డం తెలియ‌దు. ఉన్న‌ది ఉన్న‌ట్లు నిజం చెబుతుంటాడు. అయితే 13 రీళ్ల వ‌ర‌కు విల‌న్ అధిప‌త్యం కొన‌సాగినా 14వ రీల్ వ‌చ్చేస‌రికి క‌థ అడ్డం తిరుగుతుంది. విల‌న్ జైలుకు వెళ్తాడు. హీరో రాజు అవుతాడు“ ఇది  క‌థ అని చెప్పాడు. అయితే ఈ క‌థ‌లో విల‌న్ ఎవ‌రో కూడా చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టీ చేయ‌కుండా మోసం చేసిన చంద్ర‌బాబు నాయుడే ఈ సినిమాలో విల‌న్ అని పేర్కొన్నాడు. అయితే హీరో ఎవ‌ర‌నేది చెప్ప‌కుండానే క‌థ ముగించేశారు. కాగా ఈ క‌థ విన్న ప్రేక్ష‌కులు మాత్రం హీరో ఇంకెవ్వ‌రూ జ‌గ‌నే అంటూ మాట్లాడుకోవ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →