Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan is taking advantage of people’s dicrepencies

By   /  November 14, 2016  /  Comments Off on YS Jagan is taking advantage of people’s dicrepencies

    Print       Email

jaganప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్ క్యాష్ చేసుకుంటారా?

 

InCorpTaxAct
Suvidha

 

 

రాజ‌కీయ నాయ‌కులంతా అధికారం కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో అన్నీ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి అవ‌కాశ‌మే వ‌చ్చింది ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి. వివ‌రాల్లోకి వెళ్లితే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రూ.500లు, రూ.1000ల నోట్లను ర‌ద్దు చేయ‌డానికి తానే కార‌ణ‌మ‌ని, తాను చెబితేనే మోడీ ర‌ద్దు చేశార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పారు. ఇంకా చెబుతూనే ఉన్నారు. అయితే మొద‌ట్లో ఎవ‌రూ ఏమీ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా ఇప్పుడు బ్యాంకుల్లో స‌రిగా డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డం, ఏటీఎంల‌లో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో  ఏపీలో మాత్రం మోడీ, చంద్ర‌బాబుపై ప్ర‌జ‌లు  నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి ప్ర‌జ‌ల కోప‌మే జగన్ పాలిట వ‌రం కానుంది.  జగన్ కు అధికారం అందుకోవడానికి ఇది మరో మెట్ట‌ని రాజ‌కీయ విళ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక‌వేళ వైయ‌స్ జ‌గ‌న్ అలాంటి నిర్ణ‌యం ఏదైనా తీసుకుంటే మాత్రం చంద్ర‌బాబుకు అగ్ని ప‌రీక్షే కానుంది. కాగా వైయ‌స్ జ‌గ‌న్ ప‌త్రిక నెట్ వర్కు సహాయంతో పెద్ద నోట్ల రద్దు అంశంపై జనం నాడి తెలుసుకున్నారట. ఈ నిర్ణయంపై జనం మండిపడుతున్నారని ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ముఖ్యంగా  పల్లెల్లో రైతులు చాలావరకు నగదు రూపంలో దాచి పెట్టుకుంటార‌ని,  వారంతా ఇప్పుడు సమస్య ఎదుర్కొంటున్నార‌ని తెలిసింది.  రూ.2 ల‌క్ష‌ల‌కు దాటి డిపాజిట్ చేస్తే క‌ష్ట‌మ‌ని చెబుతున్న త‌రుణంలో రైతులు బాబుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా కారణంతో రాజీనామాలు చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం తమకు అనుకూలమవుతుందన్న కోణంలో వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రత్యేక హోదా కోరుతూ రాజీనామా చేస్తే అదే లక్ష్యంతో పార్టీని జనంలోకి తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ కూడా మద్దతివ్వక తప్పని పరిస్థితి. ఇప్పుడు జ‌గ‌న్ ఇదే రాజ‌కీయ వ్యూహం ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →