Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan on TDP ruling

By   /  May 2, 2016  /  Comments Off on YS Jagan on TDP ruling

    Print       Email

Jagan Mohan Reddyబాబు పాల‌న మోసం.. మోసం.. మోసం!

 

InCorpTaxAct
Suvidha

 

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల‌న అంతా మోసం.. మోసం.. మోసం అనే దానిపైనే న‌డుస్తోంది ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్రంలో తీవ్ర క‌రువు ప‌రిస్థితి నెల‌కొని ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల్సిన స‌ర్కార్ చోద్యం చూస్తోంద‌ని మండిప‌డ్డారు. క‌రువు ప‌రిస్థితుల‌పై స‌ర్కార్ తీరుకు నిర‌స‌న‌గా సోమ‌వారం గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో నిర్వ‌హించిన ధ‌ర్నాలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో పాల‌మూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోత‌ల ద్వారా కేసీఆర్ ప్ర‌భుత్వం నీళ్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తోడేస్తుంటే చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగ‌డానికి కూడా నీళ్లు లేవ‌ని, అలాంటి ప‌రిస్థితుల్లో తెలంగాణ స‌ర్కార్ ఎత్తిపోత‌ల ద్వారా నీళ్లును తోడేస్తే భ‌విష్య‌త్ లో గ్రామాలు ఎడారులుగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.
తెలంగాణ‌లో ఎమ్మెల్సీని కొన‌బోయి వీడియో టేపుల్లో.. ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికి పోయిన చంద్ర‌బాబు నాయుడు కేసీఆర్ ను అడ‌గాలంటేనే భ‌య‌ప‌డుతున్నాడ‌ని, అడిగితే ఎక్క‌డ త‌న‌పై కేసులు పెడ‌తాడోన‌ని వ‌ణికి పోతున్నాడ‌న్నారు. బాబు స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీళ్లు లేక పంట‌లు ఎండిపోయి రైతులు.. ఉపాధి ప‌నులు దొర‌క్క కూలీలు వ‌ల‌స‌లు వెళ్తున్నార‌న్నారు. ఎన్నిక‌ల ముందు రైతుల రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు రుణాలు వ‌డ్డీలోని మూడో వంతు కూడా మాఫీ చేయ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రికి ఉద్యోగం ఇవ్వ‌లేద‌ని, ఒక్క ఇల్లు కూడా క‌ట్టించ‌లేద‌న్నారు. ఇన్ని త‌ప్పులు చేసిన చంద్ర‌బాబును ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →