Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan Scared On Defections

By   /  April 30, 2016  /  Comments Off on YS Jagan Scared On Defections

    Print       Email

jaganజ‌గ‌న్ భ‌యానికి కార‌ణం అదేనా?

 

InCorpTaxAct
Suvidha

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొంచెం భ‌య‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. పైకి మాత్రం ఎంత‌మంది పోయినా ప‌ర్వాలేదు.. త‌న‌కు జ‌నం అండ‌గా ఉంటున్నార‌ని అంటున్నారే కానీ.. లోప‌ల మాత్రం భ‌య‌ప‌డుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. మొన్న ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు కేంద్ర మంత్రుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచొద్ద‌ని కోర‌డం కూడా భ‌య‌ప‌డ‌డంలో ఒక భాగ‌మే. ఎందుకంటే వైయ‌స్ఆర్‌సీపీ నుంచి నేటికీ వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. కేంద్రం ఏపీలో అసెంబ్లీ స్థానాల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం వైసీపీ నుంచి మ‌రిన్ని వ‌ల‌స‌లు ఖాయ‌మ‌నే భావ‌న‌కు వ‌చ్చిన

జ‌గ‌న్ అసెంబ్లీ స్థానాల‌ను 2026 వ‌ర‌కు పెంచొద్ద‌ని కోరార‌ట‌. అయితే తెలంగాణ, ఆంధ్ర ప్ర‌భుత్వాలు రెండు కూడా అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపుతున్నాయ‌ని, వాటిని ప‌రిశీలిస్తున్నామ‌ని కేంద్ర మంత్రులు జ‌గ‌న్‌తో చెప్పిన‌ట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మాత్రం జ‌గ‌న్ ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెంపు ప్రతిపాదనను విరమించు కోవాలని కేంద్రమంత్రులను కోరిన జగన్, అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును పార్ల మెంట్‌లో అడ్డుకునేందుకు కృషి చేయాలని విపక్ష నేతలను కోరారంటున్నారు. అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదన వల్లే, ఇప్పటికే వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలు చాలా మంది టీడీపీలో చేరార‌ని, మ‌రికొంత‌మంది వ‌స్తున్నార‌ని అంటున్నారు.  అయితే ఇక్క‌డ ఒక్క విష‌యం ఖ‌చ్చితంగా చెప్పుకోవాలి. ఏపీలో అసెంబ్లీ స్థానాల‌ను తెలుగుదేశం పార్టీ పెంచాల‌ని కోరుతున్నా, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్య‌తిరేకిస్తున్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు కుదరన్నది నిర్వివాదాంశం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →