Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan takes Holy dip in Pushkar Ghat

By   /  August 19, 2016  /  Comments Off on YS Jagan takes Holy dip in Pushkar Ghat

    Print       Email

lakshmanపుణ్య‌స్నానానికి క్యూ క‌ట్టిన ప్ర‌ముఖులు

 

InCorpTaxAct
Suvidha

 

 

పౌర్ణ‌మి సంద‌ర్భంగా కృష్ణా పుష్క‌రాల్లో పుణ్య‌స్నానమాచ‌రించ‌డానికి ప్ర‌ముఖులు నిన్న క్యూ క‌ట్టారు. వారికి కేటాయించిన వీఐపీ ఘాట్ల వ‌ద్ద స్నానాలు చేసి న‌దీమ త‌ల్లికి  ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని పున్న‌మి ఘాట్‌లో పుణ్య‌స్నానం చేసి త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పిండ ప్ర‌ధానం చేశారు. అదే విధంగా సోమశిల ఘాట్‌వద్ద నిజామాబాద్ ఎంపీ కవిత అత్తామామలు కిషో ర్‌రావు, నవలత దంపతులతోపాటు ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు పుష్కరస్నానం చేశా రు. మట్టపల్లిలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, వాడపల్లిలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్కర పుణ్యస్నానమాచరించారు. అలాగే సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహబూబ్‌నగర్‌లోని సోమశిలలో పుష్కరస్నానం చేశారు. హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా సోమశిల చేరుకున్న ఆయన పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు.

prabhakar reddy mla

కాగా పుష్క‌రాల సంద‌ర్భంగా ఘాట్‌ల వ‌ద్ద భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకోవాల‌న్నారు. కల్కి సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో దాదాపు వేయి మంది వాలంటీర్లు పుష్కర ఘాట్‌లల్లో జాతీయ రహదారి, ఆంజనేయస్వామి, సీతారామచంద్ర దేవాలయాల ప్రాంగణాల్లో భక్తులకు పలు సేవలందిస్తున్నారు. ఘాట్ల వద్ద భక్తులకు త్రాగునీటిని అందిస్తున్నారు. అంతేగాక జాతీయ విపత్తు నివారణ సంస్థ కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎక్కడ ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి రక్షించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. జిల్లా వ్యాప్తంగా 45మంది సభ్యులు గల బృందాలు కృష్ణా తీరం వెంబడి ఘాట్లలో విధులు నిర్వహిస్తుండ‌గా.. దామరచర్ల మండలం వాడపల్లిలో సమాచార, భాషా సాంస్క­ృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్క­ృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. సత్యహరిశ్చంద్ర నాటకం, హరికథ, ఒగ్గు కథ, తదితర కళారూపాలు ఆకట్టుకుంటున్నాయి.

ysjagan

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →