Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Powerful Indians: YS Jagan vs ChandraBabu Naidu, who is leading?

By   /  March 30, 2018  /  Comments Off on Powerful Indians: YS Jagan vs ChandraBabu Naidu, who is leading?

    Print       Email

బాబును వెన‌క్కి నెట్టిన‌ వైయ‌స్ జ‌గ‌న్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ప‌వ‌ర్‌ఫుల్ ఇండియ‌న్స్‌లో మోడీకి ప్ర‌థ‌మ స్థానం

* అమిత్‌షాకు 2వ స్థానం, జ‌గ‌న్‌కు 35వ స్థానం,  బాబుకు 36వ స్థానాలు వ‌చ్చాయి

* కేసీఆర్ 52వ స్థానం, వెంక‌య్య నాయుడు 58వ స్థానాల్లో నిలిచారు.

డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెన‌క్కి నెట్టేశారు. బాబు కంటే జ‌గ‌న్‌నే ప్ర‌భావ‌శీల వ్య‌క్తిగా నిలిచారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. భారతదేశంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాను ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రూపొందించింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలకు తోడు.. వచ్చే ఏడాది రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ జాబితాను రూపొందించిన‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. కాగా ఈ జాబితిలో  ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉండగా.. బీజేపీ చీఫ్ అమిత్ షా రెండో స్థానంలో నిలిచారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మూడో స్థానంలో, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాలుగు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఐదోస్థానంలో నిలిచారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్-10లో చోటు సంపాదించారు.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌, చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత రామ్ మాధవ్, కేసీఆర్, వెంకయ్య, అసదుద్దీన్ ఓవైసీ, బాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపింద్‌ల‌పై స‌ర్వే చేశారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజానీకానికి దగ్గరవుతున్న వైయ‌స్ జ‌గ‌న్ జగన్ చివర్లో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ప్రత్యేక హోదా పోరాటంలో జగన్ బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోన్నాడని చెప్పిన సదరు వెబ్‌సైట్ విపక్ష నేతకు 35వ స్థానం కట్టబెట్టింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి పోటీదారుగా జగన్‌ను అభివర్ణించింది. కాగా, ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో పోరాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి 36వ స్థానం దక్కింది. ఈ జాబితాలో చంద్రబాబు కంటే జగన్ ఒక స్థానం ముందుండటం ఆసక్తికరం. పుల్లెల గోపీచంద్‌కు 44వ స్థానం,  బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న రామ్ మాధవ్‌కు 47వ స్థానం దక్కగా.. కేసీఆర్ 52వ స్థానంలో, వెంకయ్య 58వ స్థానంలో అస‌దుద్దీన్ ఓవైసీ 70వ స్థానంలో నిలిచారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →