ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసి వైఎస్ వివేకానందరెడ్డి..
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి గురువారం నామినేషన్ వేశారు.ఈ సమయంలో ఆయన వెంట పార్టీ ముఖ్యనేత మిథున్ రెడ్డి కూడా ఉన్నారు.ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే.. కడపలో ప్రజా ప్రతినిధులను కూడా తమ గుప్పింట్లోకి తీసుకోవాలని అధికార పార్టీ చూస్తోందని ఆరోపించారు. అయితే అమ్ముడు పోవడానికి తాము అంగట్లో సరుకులం కాదని అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు రుజువు చేస్తారని చెప్పారు.
ఈ ఎన్నికలు అవినీతికి, విలువలకు మధ్య జరిగే పోరాటంగా ఆయన అభివర్ణించారు. తాము 200కి పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే పోలింగ్ తేదీ మారే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల పోలింగ్ కూడా వచ్చేనెల 17న జరగనుండటమే కారణంగా తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.