Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSR Congress Seeks To Move No-Confidence Motion Against Andhra Pradesh Government

By   /  March 10, 2016  /  Comments Off on YSR Congress Seeks To Move No-Confidence Motion Against Andhra Pradesh Government

    Print       Email

Jagan Mohan Reddy1

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మాణం..!

InCorpTaxAct
Suvidha

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస నోటీసు ఇచ్చింది. గురువారం ఉదయం వైసీపీ ప్రతినిధులు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఇక.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఈ నోటీసుపై స్పందించారు. ఏపీ సర్కారుపై వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆయన అనుమతించారు. అవిశ్వాసంపై ఎప్పుడు చర్చించాలన్న దానిపై ఈనెల 14న స్పీకర్.. అసెంబ్లీ అభిప్రాయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని మంత్రి కాల్వశ్రీనివాసులు అన్నారు. ఈ నిర్ణయం వల్ల వైసీపీ మరింత బలహీనపడడమే కాకుండా అభాసుపాలవుతుందన్నారు. ఇందులో రాజకీయ దురద్ధేశ్యం తప్ప మరేమీ లేదన్నారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని.. ఏదో జరిగిపోతోందన్న భ్రమలను బయటకు పంపించడానికి విపక్ష నేత కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈ తీర్మానానికి వైసీపీ సభ్యులు ఎంత మంది మద్దతినిస్తున్నారో తెలుసుకుని ముందుకు రావాలని సూచించారు. తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై సభాపతి ఎప్పుడు చర్చకు అనుమతించినా తాము సిద్ధమేనన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →