Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSR Jayanthi Celebrations all over the world

By   /  July 8, 2016  /  Comments Off on YSR Jayanthi Celebrations all over the world

    Print       Email

ysrమ‌హానేత గురించి మ‌రికొంత‌

 

InCorpTaxAct
Suvidha

 

తెలుగు ప్ర‌జ‌లు ఉన్నంత కాలం మ‌రిచిపోలేని ముఖ్య‌మంత్రులు ఎవ‌రైనా ఉంటారా అంటే ఇద్ద‌రి పేర్లు ఎప్ప‌టికీ ఉంటాయ‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. వారే వైయ‌స్ఆర్‌, ఎన్టీఆర్‌. ప్ర‌జ‌ల గుండెల్లో వీరు చిర‌స్థాయిగా నిలిచిపోయారు. ప్ర‌జ‌లు ఎన్టీఆర్‌లో న‌ట‌న‌ను చూస్తే… వైయ‌స్ఆర్‌లో దేవున్ని చూశారు. మ‌హానేత మ‌ర‌ణ‌వార్త విని వేల గుండెలు ఆగిపోయాయంటే ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఎంత‌గా గుండెల్లో గూడుక‌ట్టుకున్నారో అర్థ‌మ‌వుతోంది. దివంగ‌త డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలియ‌ని కొన్ని నిజాలు…

* 1949, జూలై 8న వైయస్‌ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని క్రిస్టియ‌న్ మిష‌న‌రీ అసుపత్రిలో రాజశేఖర రెడ్డి జన్మించారు.
* విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ, కర్ణాటకలోని గుల్బర్గాలో ఎంబీబీఎస్‌ చదివారు. ఎస్‌.వి. మెడికల్‌ కళాశాలలో హౌస్‌ సర్జెన్‌ చేశారు. అప్పుడు హౌస్‌ సర్జన్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.
* వైయ‌స్ఆర్ విజ‌య‌మ్మ‌ను వివాహం చేసుకున్నారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ ష‌ర్మిల సంతానం.
* 1975లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. మొదల్లో కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితులు. 1978లో కాంగ్రెస్‌ (ఆర్‌)లో పనిచేశారు. పులివెందుల నుంచి 29 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
* 33 ఏళ్ల ప్రాయంలోనే పీసీసీ నేతగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1983–85,1998–2000 మధ్య రాష్ట్ర కాంగ్రెస్‌ (పీసీసీ) సారధిగా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత‌గా రాణించారు.
* రాయలసీమ నీటి సంక్షోభ నివారణకు ఎమ్మెల్యేలతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా పోతిరెడ్డి పాడు వరకు పాదయత్ర చేశారు.
* ఆగస్టు, 2000లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్‌ చార్జీల పెంపునను నిరసనగా తన సహచర శాసన సభ్యలతో కలిసి పద్నాలుగు రోజులు నిరాహారదీక్ష చేసి సంచలనం సృష్టించారు.
* 2003లో మండు వేసవిలో ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సుమారు 1,400 కిలోమీటర్ల దూరం రెండు నులలకు పైగా పాదయాత్ర చేశారు. అదే కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చింది.
* 2004 మే 14న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీకరించారు. ఎన్నిక‌ల ముందు చెప్పిన హామీ మేర‌కు రైతుల ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంత‌కం చేసి మాట నిలుపుకొన్నారు.
* 14 మంది కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు పనిచేయగా, కాసు బ్రహానందరెడ్డి, జలగం వెంగళరావుల తర్వాత నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కాంగ్రెస్‌ నేతగా గుర్తింపు పొందారు వైయ‌స్‌. రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి కాంగ్రెస్‌ నేతగా రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి ముఖ్యమంత్రి కూడా ఆయనే.
* వైద్యుడైన వైయస్‌ పేదల కోసం ‘ఆరోగ్యశ్రీ’ ప్రారంభించారు.
* 2009, సెప్టెంబరు 2న పల్లెబాటలో భాగంగా రచ్చబండ సమవేశాల్లో పాల్గొనడానికి ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. గంట తర్వాత ఆయన ప్రమాణిస్తున్న హెలికాప్టర్‌ ఆచూకీ తెలియకుండా పోయింది.
* న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలో పావురాల గుట్ట వ‌ద్ద ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలీ కాఫ్ట‌ర్ ప్ర‌మాదానికి గురికావ‌డంతో వైయ‌స్ఆర్ దుర్మ‌ర‌ణం పొందారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →