Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

వైసీపీలోకి వైయ‌స్ టీం?

By   /  July 14, 2016  /  Comments Off on వైసీపీలోకి వైయ‌స్ టీం?

    Print       Email

ysrcpదివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఆయ‌న అనుచ‌రులంతా ఒకొక్క‌రుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. వైయ‌స్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న టీం స‌భ్యులు  కొంద‌రు తెలుగుదేశం పార్టీలో చేర‌గా మరికొందరు భారతీయ జనతా పార్టీలోనూ, మిగిలిన వారు కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. అయితే  కొంత‌మంది మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా గడచిన రెండేళ్లుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నవారు, కాంగ్రెస్‌లో ఉన్నవారిలో పలువురు ఇపుడు జగన్‌తో చేతులు కలుపుతున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేసినపుడు పార్టీలో చేరని బొత్స, ధర్మాన వంటి వారు ఇపుడు జగన్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాలకు ఇంతకాలమూ దూరంగా ఉన్న వారిలో ఉండవల్లి అరుణ్‌కుమార్ తాజాగా జగన్‌తో భేటీ అవటం చర్చనీయాంశమవుతోంది.

త్వరలో అరుణ్‌కుమార్ కూడా వైసీపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నవారిలో కొందరు వైసీపీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికైతే కాంగ్రెస్‌లో వ్యూహకర్తగాను, వైఎస్ ఆత్మగాను ప్రచారంలో ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌తో చేతులు కలిపే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక‌పోతే ఇటీవ‌ల కొంత‌మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేర‌డంతో ఆ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌య్యాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి  తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మందే వైసీపీలో వ‌స్తార‌ని కూడా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ప‌రిణామం వైసీపీకి కొంత క‌లిసి వ‌చ్చే అంశ‌మే.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →