ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై సర్కారు తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్..
ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ఏపీ సర్కారు వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.ఈ అంశంపై విపక్ష నేత జగన్ మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. డీఎస్సీ రాసినవారు 18 నెలలుగా మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు భయంతో జీవితం గడుపుతున్నారని అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి కింద వెయ్యి నుంచి రెండు వేల వరకు ఇస్తామన్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రెండూ లేవన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు.
ఇక జగన్ వ్యాఖ్యలపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షనేత జగన్ కు ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవ చేశారు. జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. డీఎస్సీ మెరిట్ లిస్టు ఎప్పుడో ప్రకటించామన్నారు. త్వరలో ఉపాధ్యాయ నియామకాలు కూడా చేపడతామన్నారు. అయితే కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. అది ప్రభుత్వం తప్పిదం కాదని మంత్రి వివరణ ఇచ్చారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.