Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP conducted statewide Bandh demanding special status for AP

By   /  August 3, 2016  /  Comments Off on YSRCP conducted statewide Bandh demanding special status for AP

    Print       Email

ysrcpబంద్ విజ‌య‌వంతం

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర బంద్ చేయాల‌ని ఇచ్చిన పిలుపు మేర‌కు విప‌క్షాలు రాష్ట్ర బంద్‌ను కొన‌సాగించాయి. ఉదయం నుంచి ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకుని ఎక్కడికక్కడ వాహ నాలను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను అడ్డుకుంటున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప, అనం తపురం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ఎమ్మెల్యేల‌ను ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అరెస్టులు చేశారు. కొంత‌మంది కార్య‌క‌ర్త‌ల‌పై లాఠీ చార్జి కూడా చేశారు.

తిరుమలకు యథావిధిగా బస్సులు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు బంద్ పాటించాయి. బంద్ నుంచి తిరుమల యాత్రీకులకు మినహా యింపునిచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకు యథావిధిగా 275 బస్సులు నడిపారు. కాగా మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపు నివ్వడంతో ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షా లు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. దాంతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →