టీడీపీది విజయం కాదు.. వైసీపీది నైతిక విజయం: ఎమ్మెల్యే రోజా
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఎన్నికల్లో టీడీపీ గెలిచినట్లు కాదని అన్నారు. నైతిక విజయం మాత్రం వైఎస్ ఆర్ సీపీదేనని అన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు ఏకంగా 300 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పైగా గెలిచామని సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. తమ అధినేత జగన్ సింహం లాంటి వ్యక్తి అని అన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని సినిమా ఫక్కీలో చెప్పారు. ప్రజల దగ్గర తమ పార్టీదే విజయం అని అన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష పడలేదని అన్నారు. అందుకే ఇంకా రెచ్చిపోయి భారీ మొత్తంలో ఖర్చుచేససి స్థానిక సంస్థల ఓటర్లను కొనుగోలు చేశారని ఆరోపించారు. శిల్పా చక్రపాణి గతంలో 147 ఓట్ల తేడాతో గెలిచారని అన్నారు. ఇప్పుడు 57 ఓట్లతో సరిపెట్టుకున్నారని అన్నారు. దీన్ని బట్టి టీడీపీ గెలిచిందా లేక ఓడిందా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రజల మద్దతు ఉంటే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ కొట్టిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.