Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP MLA’s joining TRS

By   /  May 3, 2016  /  Comments Off on YSRCP MLA’s joining TRS

    Print       Email

kondaరాజీనామా చేసే ద‌మ్ముందా పొంగులేటి?

 

InCorpTaxAct
Suvidha

 

రాజ‌కీయ భిక్ష పెట్టిన పార్టీని వ‌దిలి టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు స‌మాధానం చెప్పాల‌ని తెలంగాణ‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘ‌వ‌రెడ్డి డిమాండ్‌చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేని పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించింద‌ని, అంతే కాకుండా ఆయ‌నను రాష్ట్ర అధ్య‌క్షుడిని చేస్తే ఈ రోజు అలాంటి పార్టీని వ‌దిలి వెళ్లిపోవ‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌న్నారు.
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌దిలి వెళ్లిపోతున్నందుకు తామేమీ బాధ‌ప‌డ‌డం లేద‌ని, కానీ ఎంపీ, ఎమ్మెల్యేల ప‌ద‌వికి వాళ్లు రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంద‌న్నారు. వాళ్ల‌కు ద‌మ్మూధైర్యం వేరే పార్టీ గుర్తుమీద గెలిచి చూపించాల‌న్నారు. ఒక‌రు ఇద్ద‌రు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఏం న‌ష్టం లేద‌ని, అలాంటినాయ‌కులు చాలా మందిని పార్టీ త‌యారు చేసుకుంటుంద‌న్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుందని అందులో ఎలాంటి సందేహం లేదని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో సుచరితకే తమ పార్టీ మద్ధతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →