Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP MP Vijaysai Reddy Threatens G Group

By   /  April 13, 2018  /  Comments Off on YSRCP MP Vijaysai Reddy Threatens G Group

    Print       Email

`జీ`ని విజ‌య‌సాయిరెడ్డి బెదిరించారు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* అందుకే జీ గ్రూప్ వెన‌క్కి వెళ్లింది

* అగ్రీగోల్డ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది

* బెదిరించిన వాళ్ల ఆధారాల‌ను బ‌య‌ట పెడ‌తాం

* ఏపీ రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబరావు

డెక్క‌న్ అబ్రాడ్‌:  అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసుకుంటామని చెప్పిన జీ-ఎస్సెల్ గ్రూప్ వెనక్కి తగ్గడానికి వైసీపీ కారణమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ బెదిరింపుల వల్లే అగ్రిగోల్డ్ ఒప్పందం చెడిపోయిందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసుకుంటామని చెప్పిన జీ-ఎస్సెల్ గ్రూప్ ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఆ సంస్థను తాము తీసుకునేది లేదని రెండు రోజుల క్రితం హైకోర్టుకు  చెప్పింది. సీబీఐ కేసులు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీ-ఎస్సెల్ గ్రూపును భయుపెట్టడం వల్లే ఆ గ్రూపు వెనక్కి తగ్గిందని కుటుంబరావు ఆరోపించారు. జీ-ఎస్సెల్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తున్నారని చెప్పారు. జీ గ్రూపు అధినేత సుభాష్ బీజేపీ ఎంపీ కావడంతో.. విజయసాయిరెడ్డి ఆయనను బెదిరించారని, ఇక్కడి విషయాల గురించి చెప్పడం వల్లే ఆయన తప్పుకున్నారన్నారు. అందువల్లే అగ్రిగోల్డ్ వ్యవహారం మళ్లీ మొదటకు వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, అయితే ప్రస్తుతానికి ఆ పేర్లను తాము బయుటపెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాము సరైన సమయంలో ఆధారాలు బయటపెడతామని ఆయున చెప్పారు.

రాష్ట్రంలో బిడ్డర్లు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు వైసీపీకి తగులుతుందని కుటుంబరావు మండిపడ్డారు. వైసీపీది రాక్షస క్రీడ అని.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లి అగ్రిగోల్డ్ వ్యవహారైంపె సీబీఐ విచారణ జరపాలని ప్రధానిని కోరుతున్నారని విమర్శించారు. బాధితుల్లో భయాన్ని పుట్టిస్తోంది వైసీపీ కాదా? అని ప్రశ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →