Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP Nellore MLA’s are leaning towards TDP

By   /  August 5, 2016  /  Comments Off on YSRCP Nellore MLA’s are leaning towards TDP

    Print       Email

tdp ycp logosఆ ఇద్ద‌రూ సైకిల్ ఎక్కేస్తున్నారా?

 

InCorpTaxAct
Suvidha

 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇక వ‌ల‌స‌లు ఆగిపోయాయ‌నుకుంటున్న స‌మ‌యంలో మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్ ఇవ్వ‌నున్నారు. నెల్లూరులో వైసీపీ బ‌లంగా ఉందనుకుంటున్న త‌రుణంలో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్లితే… నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి – కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి నారాయణ వీరిద్దరితో మంతనాలు సాగించి తేదీ కూడా ఖరారు చేశారట. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో వీరు కూడా త్వరలోనే సైకిలెక్కేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి నకీలీ మద్యం కేసు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం విపక్షంలో ఉన్న వీరిద్దరు ఎమ్మెల్యేలపై ఈ కేసు ప్రభావం బాగానే కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ కేసు వీరికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. భవిష్యత్తులో విపక్ష ఎమ్మెల్యేలుగా తమపై వేధింపులు మరింత పెరుగుతాయని వీరు అంచనా వేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే వైసీపీకి బై చెప్పి చంద్రబాబు పంచకు చేరిపోయే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. అధికార పార్టీ ‘ఆకర్ష్’ పథకానికి కొందరు ముఖ్య నేతలు వలసబాట ప‌డుతుండ‌డంతో వైసీపీ కోలుకోలేక పోతోంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు వెళ్లిన ఎమ్మెల్యేల‌కు అక్క‌డ అంత ప్రియారిటీ ఇవ్వ‌డం లేద‌ని ఒక ప‌క్క రూమ‌ర్స్ వ‌స్తున్నా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్తుండ‌డం పార్టీ అధినేత‌ను క‌ల‌వ‌ర పెడుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →