Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

YSRCP plenary will conduct in Telangana on 22nd

By   /  June 14, 2017  /  Comments Off on YSRCP plenary will conduct in Telangana on 22nd

    Print       Email

22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ.. హాజరుకానున్న జగన్..

 

InCorpTaxAct
Suvidha

 
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీని అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నారని తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ వెల్లడించారు. పార్టీ ప్లీనరీని హైదరాబాదులో నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ హాజరవుతారని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లీనరీలో చర్చిస్తామని చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ వైఫల్యాలపై కూడా చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్ వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్ గా మారిందన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →