Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP- TDP- TRS candidates to Rajya Sabha is confirmed

By   /  June 1, 2016  /  Comments Off on YSRCP- TDP- TRS candidates to Rajya Sabha is confirmed

    Print       Email

tdp flag with ycp flag newఏక‌గ్రీవం

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి నాలుగు స్థానాలు, తెలంగాణ నుంచి రెండు రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది. వేరే పార్టీల నుంచి ఎవ‌రూ నామినేష‌న్ వేయ‌క‌పోవడంతో ఎన్నిక‌లు ఏక‌గ్రీవం కానున్నాయి.

తెలుగుదేశం పార్టీ నుంచి సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్‌, సురేష్ ప్ర‌భులు ముగ్గురు నామినేష‌న్లు వేయ‌గా, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి వీళ్ల‌కంటే ముందురోజే నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. కాగా టీడీపీకి చెందిన ముగ్గురు అభ్య‌ర్థుల నామినేష‌న్ ప‌త్రాల‌పై మొద‌టి సంత‌కం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేశారు.  సరిగ్గా 11 గంటలకు ప్రభు నామినేషన దాఖలు చేయగా… ఆ తర్వాత తమ తమ ముహూర్తాలను బట్టి సుజనాచౌదరి, టీజీ నామినేషన్లు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీ అభ్యర్థులుగా మాజీ మంత్రులు కెప్టెన్ ఒడితెల లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వచ్చిన ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాధ్యతల్లో ఉన్న తెలంగాణ లెజిస్లేటివ్ కార్యదర్శి డాక్టర్ రాజాసదారాంకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నిక విషయాన్ని షెడ్యూల్ ప్రకారం జూన్ మూదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక‌ల విష‌యాల‌ను అధికారికంగా ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నాల్గ‌వ అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని ముందు అనుకున్నా త‌ర్వాత ఎందుకు కొంచెం త‌గ్గారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →