Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP- TRS

By   /  May 7, 2016  /  Comments Off on YSRCP- TRS

    Print       Email

ycpటీఆర్ఎస్‌లో విలీన‌మైన వైసీపీ

 

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణ వైసీపీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. తమను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించాలని శాసనసభ స్పీకర్‌ మధుసూదనా చారికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఎమ్మెల్యేల వినతిని పరిగణనలోనికి తీసుకున్న స్పీకర్ వారిని టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ బులిటెన్‌ విడుదల చేశారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 81కి చేరింది. అయితే దీన్ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. కేసీఆర్‌ త‌ప్పులు బ‌యట ప‌డ‌తాయ‌నే టీఆర్ఎస్ వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తోద‌ని మండిప‌డుతున్నాయి. కేసీఆర్ కూడా ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాదిరే మాట‌లు మాట్లాడుతున్నారు కానీ.. చేత‌లు చేయ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
ఒక పార్టీపై గెలిచిన మ‌రో పార్టీలోకి తీసుకోవ‌డం అన్యాయ‌మ‌ని తెలిసినా కేసీఆర్ అలా ఎలా చేస్తాడ‌ని విప‌క్ష నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ ఇలాగే చేసుకుంటూ పోతే మాత్రం ప్ర‌జ‌ల చేతిలో త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని వాళ్లు హెచ్చ‌రిస్తున్నారు. కాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి మాత్రం విప‌క్షాల ఆరోప‌ణ‌లు ప‌ట్టించుకోకుండా తాను ఏం చేయాల‌నుకుంటున్నారో అలాగే చేస్తూ ముందుకెళ్తుండ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →