యువీ.. పాదాభివందనం!
క్రికెట్ దూరమైన ఆయనకు అభిమానులు తగ్గడం లేదు. అతన్ని దేవునిగా కొలిచే అభిమానులూ తగ్గలేదు. నేటికి అభిమానుల అండదండలు మెండుగా ఉన్న ఏకైక క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ మాస్టర్ అంటే సామాన్యులతో పాటు సాటి క్రికెటర్లు కూడా పిచ్చిగా అభిమానిస్తారంటే అతిశయోక్తి కాదు. సచిన్‌ను అంతగా అభిమానించే క్రికెటర్లలో యువరాజ్ కూడా ఒకరు. సచిన్ ఎక్కడ కనిపించినా ఆయనకు పాదాభివందనం చేస్తారు. అంతేకాదు ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. తాజాగా ఆదివారం ఐపీఎల్లో ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ యువీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పాదాలకు వందనం చేసి సచిన్ ఆశీస్సులు తీసుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత ముంబై మెంటర్ సచిన్ కూడా ఐపీఎల్ ప్లేయర్లను గ్రీట్ చేశాడు. ఆ టైమ్‌లో సచిన్ కాళ్లను తాకుతూ తన అభిమానాన్ని యువీ చాటుకున్నాడు. గతంలోనూ యువీ ఇలాగే సచిన్ పాదాలను తాకాడు. 2014 జూలైలో లార్డ్స్‌లో వరల్డ్ లెవన్‌తో మ్యాచ్ జరిగిన సమయంలోనూ సచిన్ పాదాలను తాకుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎంతైనా ఇలాంటి అభిమానులను సచిన్ సంపాదించుకోవడం ఆయన అదృష్టం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.